![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -174 లో..... బన్సీ ఇంటికి వెళ్లి మాధవ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన విషయం చెప్తాడు. ఆ తర్వాత ఇంకా అన్నయ్య ఇంటికి రాలేదని ఒకవైపు కేశవ మరొకవైపు కన్నా, చక్రి బాధపడుతారు. ఎంత వెతికినా దొరకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటారు. చక్రి, మహా వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. బతికి ఉంటే వస్తాడులే అని ఇన్స్పెక్టర్ అంటుంటే చక్రికి కోపం వస్తుంది. బయటకి వచ్చి తన ఫ్రస్ట్రేషన్ బయటపెడుతాడు. మా అన్నని అలా అంటాడా అని ఎమోషనల్ అవుతాడు.
చక్రి బాధపడుతుంటే తనని చూసి మహా కూడా బాధపడుతుంది.మరొకవైపు కన్నా బాధపడుతాడు. మనల్ని వద్దు అనుకొని వెళ్ళాడు. ఇక రాడు మనం బాధపడుతూనే ఉందామా.. మనం ఇక బాధపడొద్దు బిర్యాని తీసుకొని రండి తిందాం అని కన్నా అనగానే అతని చెంపచెల్లుమనిపిస్తాడు చక్రి. అన్నయ్య రాకుంటే వెర్రి వాడిలాగా తిరిగేది నువ్వే అని చక్రి కోప్పడతాడు. ఆ తర్వాత నారాయణ అంతా వెతికి అలసిపోయి ఇంటికి వస్తాడు మీరు ఇంటిదగ్గర ఉండండి అని నారాయణకి కేశవ చెప్తాడు. ఆ తర్వాత ఇంటికి తాయారు, రమణయ్య వస్తాడు. ఎందుకు మమ్మల్ని చూసి నవ్వి పోదామని వచ్చారా అని నారాయణ అనగానే మీలాగా మేం బండలం కాదు వాడొక్కడే ఈ ఇంట్లో మంచి మనిషి అని తాయారు అంటుంది.లోపలికి వెళ్తుంది. ఏమన్నారు వాడు ఎందుకు వెళ్ళిపోయాడని అడుగుతుంది. పంతులు గారు జాతకం చూసి పెళ్లి కాదు అంటూ మాట్లాడారు.. ఎవరు ఆ పంతులు ఒక్క నిమిషం వాడు ఒప్పుకుంటే గాయత్రితో పెళ్లి అయ్యేది ఏం బాధపడకండి అని తాయారు చెప్తుంది.మరొకవైపు మనీషా గుడికి వెళ్తుంది. అక్కడ మాధవని చూసి మాట్లాడుతుంది. తనని తన వెంట తీసుకొని వెళ్తుంది.
ఆ తర్వాత రాత్రి కన్నా భోజనం చేయకుండా ఏడుస్తూనే ఉంటే చక్రి, మహా నచ్చజెప్పుతారు. ఆ తర్వాత మాధవని తీసుకొని మనీషా ఇంటికి వెళ్తుంది. అక్కడ మాధవని చూసి బన్సీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేను ఉన్నట్టు ఎవరికి చెప్పొద్దని మాధవ చెప్తాడు. తరువాయి భాగంలో బన్సీకి మహా ఫోన్ చేస్తుంది. మహా ఏం అడుగక ముందే మాధవ ఇక్కడ లేడు అని చెప్పేసరికి మహాకి డౌట్ వస్తుంది. వెంటనే చక్రి , మహా ఇద్దరు బన్సీ ఇంటికి బయల్దేర్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
SEO Keywords:
![]() |
![]() |